హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై స్టే పొడిగింపు..జనవరి 28కి వాయిదా వేసిన హైకోర్టు

  • ఫోన్ ట్యాపింగ్​ కేసు 

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి అందిన ఫిర్యాదులో హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడ్డారంటూ రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారి జి.చక్రధర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేయాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారని తెలిపారు.

దీనిపై సమాధానం ఇవ్వడానికి ఫిబ్రవరి దాకా గడువు కావాలని కోరారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ కేసు దర్యాప్తులో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే.. ఇప్పటివరకు విచారణకు పిలవలేదన్నారు. స్టే గడువు ముగిసిపోతున్నందున పొడిగించాలని కోరారు. మరోవైపు పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సంక్రాంతి సెలవులైన వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. వాదనలను విన్న జడ్జి.. విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూ స్టేను పొడిగించారు.